విరించి హాస్పిటల్​కు హైకోర్టు నోటీసులు

విరించి హాస్పిటల్​కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : హాస్పిటల్​ వ్యర్థాలను గుంత తీసి అందులో పూడ్చుతున్నారనే అభియోగాల కేసులో హైదరాబాద్ ప్రేమ్ నగర్ లోని విరించి హాస్పిటల్​కు హైకోర్టు నోటీసులిచ్చింది. గుంతను పూడ్చివేసి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా, ప్రభుత్వ వాదనల తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విరించి హాస్పిటల్​కు వ్యతిరేకంగా ఖైరతాబాద్​కు చెందిన రిజ్వాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్​ల బెంచ్ ఈ పిటిషన్​ను విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ప్రతివాదులైన విరించి ఆస్పత్రితో పాటు మున్పిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి ఇతరులకు నోటీసులిచ్చింది.