పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సీసీ కెమెరాల వివరాలివ్వండి: హైకోర్టు

పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సీసీ కెమెరాల వివరాలివ్వండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో  సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారో, ఇంకా ఎన్ని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఏర్పాటు చేయాల్సివుందో వివరాలు అందజేయాలని సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో  రిపోర్టు ఇవ్వాలని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బెంచ్​ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏమేరకు అమలు చేశారో చెప్పాలని బెంచ్​ ఆదేశించింది. 
గచ్చిబౌలి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమానాస్పద మృతిపై అందిన లేఖను హైకోర్టు పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించి విచారణ చేపట్టింది. నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది కస్టోడియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెత్ కాదని, గుండెపోటు వల్ల మరణించాడని అదనపు ఏజీ రామచంద్రరావు చెప్పారు. దీనికి చెందిన సీసీ ఫుటేజీ ఉందని, దీనిని స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించిందని తెలిపారు. ఆ పుటేజీని పరిశీలిస్తామని చెప్పిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.