
హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి చిట్‌ఫండ్‌లో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ చేస్తున్న దర్యాప్తును కొనసాగించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణపై స్టే ఇవ్వలేమని చెప్పింది. అయితే, దర్యాప్తు పేరుతో ఏపీ సీఐడీ బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న రామోజీరావు, ఆసంస్థ ఎండీ శైలజ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు 300 మంది మార్గదర్శి మేనేజర్లకు నోటీసులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ రామోజీరావు, శైలజ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణను ఈ నెల 20కి వాయిదా పడింది.