జర్నలిస్ట్ రఘు అరెస్టుపై డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

V6 Velugu Posted on Jun 09, 2021

  • కేసుల వివరాలు కావాలంటే వినతిపత్రం ఇవ్వాలా?

జర్నలిస్ట్ రఘుపై నమోదు చేసిన కేసుల వివరాలు సమర్పించాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఈ నెల 14లోగా కేసుల వివరాలు సమర్పించాలని సూచించింది. రఘు అరెస్ట్ పై ఆయన భార్య లక్ష్మీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా.. రఘు బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ ఉన్నందున.. కేసుల వివరాలు ఇవ్వాలని ఆయన భార్య కోరింది. అయితే కేసుకు సంబంధించిన వివరాల కావాలంటే డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఇదే విషయాన్ని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. కేసుల వివరాలు ఇవ్వడానికి డీజీపీ వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. రఘు భార్య లక్ష్మీ వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

Tagged Hyderabad, Telangana, high court, Journalist Raghu, Journalist Raghu wife, Journalist Raghu arrest

Latest Videos

Subscribe Now

More News