లిఫ్ట్‌‌ ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకున్నరు..కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

లిఫ్ట్‌‌ ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకున్నరు..కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లిఫ్ట్‌‌ ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిఫ్ట్‌‌ల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలను అమలు చేయకపోవడంతో పలువురు చనిపోయారంటూ ఓ వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దాన్ని హైకోర్టు సుమోటో పిల్‌‌గా పరిగణనలోకి తీసుకున్నది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌పాల్, జస్టిస్‌‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌‌ ఇటీవల విచారణ చేపట్టింది.

ప్రతివాదులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రజల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.