సినీనటి కల్పికను అరెస్ట్ చేయొద్దు హైకోర్టు ఆదేశాలు 

సినీనటి కల్పికను అరెస్ట్ చేయొద్దు హైకోర్టు ఆదేశాలు 

గచ్చిబౌలి, వెలుగు: సినీ నటి కల్పికకు హైకోర్టులో ఊరట లభించింది. మే 29న కల్పిక తన బర్త్​డే సందర్బంగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్​లో స్నేహితులకు పార్టీ ఇచ్చారు.  కేకు విషయంలో పబ్ సిబ్బందితో  గొడవ అయింది. దీంతో తమపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బిల్లు కట్టకుండా వెళ్లిపోయారంటూ పబ్​ యాజమాన్యం ఆమెపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ పబ్​పై సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని సైబర్​ క్రైంలోనూ కంప్లయింట్​ ఇచ్చారు. ఈ రెండు ఘటనల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. తనను అరెస్ట్​ చేయవద్దంటూ కల్పిక హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను అరెస్ట్​ చేయవద్దని పోలీసులను గురువారం హైకోర్టు ఆదేశించింది.

నా బిడ్డ మానసిక స్థితి సరిగ్గా లేదు..

కల్పిక మానసిక స్థితి సరిగ్గా లేదని అమె తండ్రి గణేశ్​ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన గచ్చిబౌలి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కల్పికకు ట్రీట్​మెంట్​ అందించేలా చూస్తామని చెప్పారు.