
హైదరాబాద్, వెలుగు: ఎమ్మార్వో కుల ధ్రువీకరణపత్రం జారీ చేశారని, దీనిపై తనిఖీ పూర్తయ్యే వరకు అభ్యర్థిని యూపీఎస్సీ కోచింగ్ తరగతులకు అనుమతించాలని ఎస్సీ సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కుల ధ్రువీకరణ కాలేదంటూ క్షేత్ర స్థాయిలోని పరిశీలకుడు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా తనను తరగతులకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం నల్లూరు గ్రామానికి చెందిన డి.కార్తీక్ కుమార్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్టీ సంక్షేమ శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.