- ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై మాల్ ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో 2023లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కేసు నమోదుపై న్యాయమూర్తి పలు సందేహాలు వ్యక్తం చేశారు.
పరీక్ష జరుగుతుండగా బయటి వ్యక్తి ఎలా లోపలికి వచ్చారని ప్రశ్నించారు. పిటిషనర్‌పై మాల్ ప్రాక్టీస్ చట్టం కింద కేసులు నమోదు చేశారని, వాటికి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని పీపీ పల్లె నాగేశ్వరరావును న్యాయమూర్తి ఆదేశించారు.
