సీఎం సభకు అడ్డంకులు తొలగినట్లేనా?

V6 Velugu Posted on Apr 12, 2021

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న  సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలన్న పిటిషన్ ల విచారణకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఉప ఎన్నిక జరగనున్న నాగార్జున సాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్యతోపాటు సభ నిర్వహించే భూముల రైతులు పలు పిటిషన్లు వేశారు. వీటి విచారణకు అత్యున్నత ధర్మాసనం నో చెప్పింది. రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు కావడంతో 14న జరగనున్న కేసీఆర్ సభకు ఉన్న అడ్డంకులు తొలిగినట్లేనని తెలుస్తోంది. 

Tagged high court, CM KCR, bypoll, petitions

Latest Videos

Subscribe Now

More News