నామినేషన్‌‌‌‌‌‌‌‌ స్వీకరణకు ఆదేశాలివ్వలేం..పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

నామినేషన్‌‌‌‌‌‌‌‌ స్వీకరణకు ఆదేశాలివ్వలేం..పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో నామినేషన్‌‌‌‌‌‌‌‌ను స్వీకరించాలంటూ ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలంటూ సంగారెడ్డికి చెందిన ఎం.సంజీవులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ చేపట్టింది. నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఇందులో జోక్యం చేసుకోలేమని ఉత్తర్వులు ఇచ్చింది.