
హైదరాబాద్, వెలుగు : పట్టాదార్ పాస్ పుస్తకం జారీకి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది. వికారాబాద్ జిల్లా కొత్రేపల్లి గ్రామానికి చెందిన అమీనా బేగం 6.02 ఎకరాలకు పట్టాదార్ పాస్ పుస్తకం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఆధార్ నంబర్ లేదని అధికారులు పాస్ బుక్‌జారీ చేయలేదు. దీంతో అమీనా బేగం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారించారు. ఆధార్ నంబర్ లేని కారణంగా పాస్ పుస్తకం జారీచేసేందుకు అధికారులు నిరాకరించారని అమీనా తరపు అడ్వొకేట్ టి.బాలస్వామి చెప్పారు. ఆధార్ లేకపో యినా పాస్‌బుక్ ఇవ్వాలని అధికారులకు జస్టిస్ సూరేపల్లి నందా ఆదేశాలు జారీచేశారు.