‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదలకు హైకోర్టు బ్రేక్

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదలకు హైకోర్టు బ్రేక్

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదలకు హైకోర్టు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా టైటిల్ విషయంలో, టీజర్ , ట్రైలర్ విషయాల్లోను పలు వివాదాలు చెలరేగుతున్నాయి.  సినిమాపై వేసిన పిటిషన్లను విచారించిన హై కోర్టు.. గురువారం ఊహించని తీర్పు ఇచ్చింది.

ఇప్పటి వరకు చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదని సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు కోర్టుకి తెలుపగా.. వారం రోజుల్లో సినిమా ను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు ను హైకోర్టు ఆదేశించింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్ కు సూచించింది. రెండు కులాల మధ్య చిచ్చు రగిలించేలా ఉన్న  టైటిల్ ను మార్చాలని చెప్పింది.

సినిమా టైటిల్ మారుస్తామని , సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రాంగోపాల్ వర్మ తరపు అడ్వకేట్ కోర్టును కోరారు.  అయితే గురువారం కోర్టు ఇచ్చిన తీర్పుతో సినిమా విడుదలకు వాయిదా పడింది.

High Court stay order for release of Kamma rajayamlo kadapa redlu