ఇమ్రాన్‌‌ ప్రసంగాల లైవ్​పై బ్యాన్‌‌ ఎత్తివేత

ఇమ్రాన్‌‌ ప్రసంగాల లైవ్​పై బ్యాన్‌‌ ఎత్తివేత

నిషేధాన్ని సస్పెండ్‌‌ చేసిన హైకోర్టు 

ఇస్లామాబాద్‌‌: పాకిస్తాన్‌‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై పాక్‌‌ ఎలక్ట్రానిక్‌‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) విధించిన నిషేధాన్ని హైకోర్టు సోమవారం సస్పెండ్‌‌ చేసింది. ఆగస్టు 20న ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్‌‌ఖాన్‌‌ చేసిన ప్రసంగం, ప్రభుత్వ సంస్థలను బెదిరించడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండటంతో ఆయన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఇమ్రాన్‌‌ ఇస్లామాబాద్‌‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి అథర్‌‌‌‌ మినాల్లా, పెమ్రా తన అధికారాన్ని మించి ప్రవర్తించిందన్నారు. బ్యాన్‌‌ సమర్థనీయమా? కాదా? అని తేల్చేందుకు ఓ అధికారిని నియమించాలని పెమ్రాను ఆదేశిస్తూ విచారణనను సెప్టెంబర్‌‌‌‌5కు వాయిదా వేశారు.