భూపతిరెడ్డి పై వేటు సబబే: హై కోర్టు

భూపతిరెడ్డి పై వేటు సబబే: హై కోర్టు

శాసన మండలి లో భూపతిరెడ్డిపై అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భూపతిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనర్హత రాజ్యాంగ బద్దంగానే ఉందని పేర్కొంది. 2016 లో స్థానిక సంస్థల కోటలో టీఆర్ఎస్ తరపున్న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు భూపతి రెడ్డి. అయితే ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆ  పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధ్యక్షుడు కేసీఆర్ కు మాజీ ఎంపీ కవిత, నిజామాబాద్ జిల్లా నేతలు లేఖ రాశారు. దీంతో భూపతిరెడ్డి పై వేటు పడింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భూపతిరెడ్డి కాంగ్రెస్ లో చేరారు.