గదాధారి హనుమాన్ టీజర్ విడుదల..

గదాధారి హనుమాన్ టీజర్ విడుదల..

రవి కిరణ్ హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వంలో రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మిస్తున్న చిత్రం ‘గదాధారి హనుమాన్’. శుక్రవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. నిర్మాతలు సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర అతిథులుగా హాజరై ‘హనుమాన్’ స్థాయిలో ఈ  సినిమా కూడా పెద్ద  సక్సెస్ సాధించాలని విష్ చేశారు. రవి కిరణ్ మాట్లాడుతూ ‘హనుమాన్ ఆశీస్సులతో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరించాం. 

ఇందులోని  క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. అలాగే  అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి’ అని  చెప్పాడు.  దర్శకుడు రోహిత్ కొల్లి మాట్లాడుతూ ‘సింపుల్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో అనుకున్న మూవీ.. ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. హనుమాన్  గద ఎంత పవర్ ఫుల్ అనేది ఓ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లో చూపించబోతున్నాం’ అని చెప్పాడు. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.