దేవరయాంజల్ భూములు: మేం చెప్పే వరకు జోక్యం వద్దు

V6 Velugu Posted on May 08, 2021

దేవరయాంజల్ భూముల  దర్యాప్తుపై ఇపుడు తొందరెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. భూముల దర్యాప్తుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా .. ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై ఇప్పుడే తొందర ఎందుకని ప్రశ్నించింది.  ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకని నిలదీసింది.  కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా?అని అడిగింది.  కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేశామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవన్న అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు .. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వాలని కమిటీకి ఆదేశమిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు కమిటీ విచారణకు సహకరించాలని సూచించింది.  వారి వివరణ తీసుకున్నాకే నివేదక ఇవ్వాలని చెప్పింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

Tagged TRS, Telangana, high court, eatal rajender, Devarayamjal, land investigation

Latest Videos

Subscribe Now

More News