మియాపూర్ భూముల స్కాంపై హైకోర్టు తీర్పు

మియాపూర్ భూముల స్కాంపై హైకోర్టు తీర్పు

మియాపూర్ భూముల కుంభకోణంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. స్కాంకు సంబంధించి సీబీఐ దర్యాప్తు అవసరంలేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే రఘునందన్ దాఖలు చేసిన పిల్పై విచారణ ముగించింది. 2018లోనే 24 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ హైకోర్టుకు దర్యాప్తు నివేదిక అందజేశారు. పార్థసారథి, పీవీఎస్ శర్మ సహా 11 మందిపై హైకోర్టు కేసు కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గత నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే దర్యాప్తు నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిన తర్వాత జీవోలు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తీర్పు చెప్పింది. 

For more news..

సర్కార్ తప్పులు గుర్తు చేసేందుకు ఈనెల 9న యుద్ధభేరి

కనీసం 150 సీట్లు గెలవాలె