సీబీఎస్ఈ సిలబస్​ చెప్పకుండా.. అధిక ఫీజులు వసూలు చేస్తున్రు

సీబీఎస్ఈ సిలబస్​ చెప్పకుండా.. అధిక ఫీజులు వసూలు చేస్తున్రు


మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

కోల్​బెల్ట్, వెలుగు: సీబీఎస్ఈ సిలబస్ ​చెప్పకుండా అధిక ఫీజులు తీసుకుంటున్న గ్రీన్​వుడ్​స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పేరెంట్స్​ ఆందోళనకు దిగారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వారికి రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మందమర్రి మండలం గద్దెరాగడిలోని గ్రీన్​వుడ్​స్కూల్​లో సీబీఎస్ఈ ఉందని చెబుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్​కాకుండా ఎక్సీడ్ అనే ప్రైవేట్ పబ్లికేషన్ ముద్రించిన లెసెన్స్​చెబుతున్నారని మండిపడ్డారు. స్కూల్​లో క్వాలిఫైడ్​టీచర్లను నియమించకుండా స్టూడెంట్ల భవిష్యత్​తో చెలగాటమాడుతున్నారని వాపోయారు. 

అనంతరం అడిషనల్​కలెక్టర్​రాహుల్, డీసీపీ సుధీర్​కేకన్​రాంనాథ్ ను వేర్వేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చారు. అంతకు ముందు స్కూల్​ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో టీడీపీ లీడర్​సంజయ్​కుమార్, దళిత సంఘం లీడర్​పలిగిరి కనకరాజు, తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, బీసీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సల్మాన్, ఎన్ఎస్ సీ జిల్లా అధ్యక్షుడు పురేళ్ల నితీశ్, టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేశ్,  తల్లిదండ్రులు పాల్గొన్నారు.