కేరళలో కఠిన ఆంక్షలు

కేరళలో కఠిన ఆంక్షలు

కేరళలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు విధించేందకు సిద్ధమైంది. స్కూళ్లు, కాలేజీలు, పబ్లిక్ మీటింగ్ లపై నిషేధం విధించే ఛాన్స్ ఉంది.  సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కరోనాపై జరిగే సమీక్షా సమావేశంలో కోవిడ్ ఆంక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని వైద్యారోగ్యశాఖమంత్రి వీణా జార్జ్  చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా నాలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని..అక్కడ మాత్రం కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలు విధిస్తామని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

ఉత్తరాఖండ్ లో బీజేపీ తొలి జాబితా విడుదల

అఖిలేష్ యాదవ్ కు మరో షాక్