హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్ నెలకొంది. 2026 అక్టోబర్ 2న శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
అప్రమత్తమైన ఎయిర్ లైన్స్ సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడి నిర్వాకంతో విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అతడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక ఇతర కారణాలతో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రయాణికుడి ప్రవర్తనకు గల అసలు కారణం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రయాణికుడి వివరాలను తెలియాల్సి ఉంది.
