
ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో నుంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉండటం కామన్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం అలాంటిదే. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సముద్రంలో సొరచేపతో ఎన్టీఆర్ చేసే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందంటున్నారు మేకర్స్.
రీసెంట్‌గా ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరిగిందట. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఫైట్ సీన్‌ను రూపొందిస్తున్నాడట కొరటాల. జాన్వీకపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ మూవీ ‘వార్2’లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిసిందే.
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని, తన పాత్రను దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఆఖరి కల్లా మొత్తం షూట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 2025 జనవరి 25 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించనున్నాడు.