
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మట్కా’. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాసివ్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు. సినిమాలో చాలా కీలకంగా ఉండే ఈ ఫైట్ సీక్వెన్స్ విజయ్ మాస్టర్ సూపర్ విజన్ లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ చాలా రిస్కీ స్టంట్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాడట. ఈ హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్.. సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.
ఇందులో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్నాడు. దేశవ్యాప్తంగా అందరినీ కదిలించిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్. నవీన్ చంద్ర, రవి శంకర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.