గుంటూరు కారం స్పైసీ మాస్ నంబర్ హాట్..సూపర్ ఫ్యాన్స్ గెట్ రెడీ

గుంటూరు కారం స్పైసీ మాస్ నంబర్ హాట్..సూపర్ ఫ్యాన్స్ గెట్ రెడీ

సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

సూపర్ ఫ్యాన్స్, వాల్యూమ్‌ని పెంచడానికి సిద్ధంగా ఉండండి! గుంటూరు కారం నుండి ఒక హై వోల్టేజ్ స్పైసీ మాస్ నంబర్ హాట్..మరియు డ్యాన్స్ ఫ్లోర్‌లను దద్దరిల్లించడానికి రెడీగా ఉండండి..అంటూ మేకర్స్ ట్యాగ్ చేశారు.

ఈ పోస్టర్ లో మహేష్ మాస్ స్వాగ్ లుక్స్, శ్రీలీల మత్తిక్కించే లుక్స్ మహేష్ ఫ్యాన్స్ ని మరింత ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఫస్ట్ సింగిల్ తో మాస్ మసాలా..సెకండ్ సింగిల్ తో లవ్ దునియా..థర్డ్ సింగిల్ తో స్పైసీ మాస్..ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుంటూరు కారంతో అదిరిపోయే ఫెస్టివల్ ట్రీట్ గ్యారంటీ అని అర్ధం అవుతోంది. 

దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హారిక హాసిని క్రియేషన్స్ (Harika hasini creations) పై చినబాబు (Chinababu), సూర్యదేవర నాగవంశీ (Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది.