డేటా వాడకం పీక్‌కు..పెరగనున్న జియో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ

డేటా వాడకం పీక్‌కు..పెరగనున్న జియో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ

న్యూఢిల్లీ: డేటా వాడకం పెరగడం వలన ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, జియో రెవెన్యూ భారీగా పెరుగుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. అంతేకాకుండా 2జీ నుంచి 4జీ కి యూజర్లు షిప్ట్‌‌‌‌‌‌‌‌ అవ్వడం పెరిగిందని, ఈ రెండు కంపెనీలకు ఇది లాభం చేకూరుస్తుందని అన్నారు. యూజర్లను కోల్పోతుండడంతో  వొడాఫోన్ ఐడియా (వీ) రెవెన్యూ మాత్రం తగ్గిపోయే అవకాశం ఉందని అంచనావేశారు. కొత్త  పోస్ట్ పెయిడ్ యూజర్లు పెరగడంతో పాటు, 2జీ నుంచి 4జీ కి యూజర్లు కన్వర్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుండడంతో జియో కంటే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ యావరేజ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ పెర్ యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీయూ) ఎక్కువగా ఉంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.

అన్‌‌‌‌‌‌‌‌లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ డేటాను  జియో 5జీ యూజర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారని, దీంతో కంపెనీ ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీయూ పెద్దగా పెరగకపోవచ్చని  ఎనలిస్టులు పేర్కొన్నారు. తన అన్‌‌‌‌‌‌‌‌లిమిటెడ్ ప్లాన్లు ప్రజల్లోకి వెళుతుండడంతో వీ ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీయూ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెరుగుతుందని అన్నారు. కాగా, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే జియో కస్టమర్లు ఎక్కువ పెరుగుతారని వివరించారు.  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ తన బేస్ ప్రైస్‌‌‌‌‌‌‌‌ను పెంచడమే ఇందుకు కారణమని అన్నారు. వీ తో పోలిస్తే జియో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ తమ 5జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను వేగంగా విస్తరిస్తున్నాయి. జియో దేశం మొత్తం మీద 6 వేల సిటీలు లేదా టౌన్లలో 5జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు అందిస్తుండగా, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ 3 వేల సిటీలు లేదా టౌన్లలో అందిస్తోంది. వీ ఇంకా లాంచ్ డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించలేదు.