ఎన్నికల ‘కోడ్‌ ’లోనూ కోట్ల ఆదాయం !

ఎన్నికల ‘కోడ్‌ ’లోనూ  కోట్ల ఆదాయం !
  •  ఎన్నికల టైంలో జోరుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు
  • రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు భారీగా ఆదాయం
  • నవంబర్​ 1 నుంచి మే 20 దాకా రూ.3,435.9 కోట్లు
  • ఏడు నెలల్లో రూ.508.37 కోట్ల అదనపు ఆదాయం

హైదరాబాద్ , వెలుగు: వరుసబెట్టి ఎన్నికలొచ్చి కోడ్ అమల్లో ఉన్నా రిజిస్ట్రేషన్ల శాఖకు కోట్లు సమకూరాయి. నవంబర్ 1 నుంచి మే20 దాకా రిజిస్ట్రేషన్లు బాగా పెరిగాయి. ఈ కాలంలో రూ.3,435.9 కోట్ల ఆదాయం వచ్చిం ది. గత ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే టైంలో రూ.2,927.6కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు నెలల్లోనే రూ.508.37 కోట్లు ఎక్కువగా వచ్చాయి. గత ఏడాది 7,34,489 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవగా, ఈ ఏడాది అది 8,88,795కు పెరిగింది.

వరుస ఎన్నికలు

నవంబర్ మొదలు రాష్ట్రంలో వరుసగా ఎన్నికలొచ్చాయి. నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో పంచాయతీ, ఏప్రిల్ లో లోక్ సభ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో కి వచ్చింది. కోడ్ నేపథ్యంలో రూ.50 వేలకు మించి డబ్బు తరలిం చడానికి వీల్లేదు. ఒకవేళ ఎక్కువమొత్తం తీసుకెళితే తగిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు చూసేవారు,భూములు, ఫ్లాట్లు కొనేవాళ్లు మార్కెట్  రేటు ప్రకారం డబ్బులు చెల్లించినా అసలు ధర వేరే ఉంటుంది. అదే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. దీంతో ఎన్నికల కోడ్ టైంలో చాలా మంది పెద్ద మొత్తాలను రహస్యంగా తరలించి కొనుగోళ్లు జరిపినట్టు తెలుస్తోంది.దీంతో పోలీసులు సోదాలు సరిగ్గా చేయలేదా అన్నఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా జరిగాయి. గత ఏడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 20 దాకా ఆ జిల్లాలో 2,05,808 డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి. ఆదాయం రూ.1,274కోట్లు వచ్చింది. రూ.738 కోట్లతో తర్వాతి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిలిచిం ది.

ఆదాయం మస్తు మస్తు

2018–-19 ఆర్థిక సంవత్సరంలో  రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు ఆదాయం భారీగానే వచ్చింది. మొత్తంగా రూ.5,880.8 కోట్ల ఆదాయం సమకూరిం ది. 15,32,980 డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి. 2017-–2018 సంవత్సరంలో మాత్రం రూ.4,571.9 కోట్ల ఆదాయం రాగా,11,50,524 డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి.అంటే ఈ ఏడాది రూ.1,308 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిం ది. రంగారెడ్డి జిల్లా నుంచిఎక్కువ ఆదాయం సమకూరిం ది. రూ.2,117 కోట్లురాగా, 3,52,540 పత్రాలు రిజిస్టర్ అయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరిలో రూ.1,299 కోట్ల ఆదాయం వచ్చింది. 1,72,644 పత్రాలు రిజిస్టరయ్యాయి.అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో రూ.69.8 కోట్లఆదాయం వచ్చిం ది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చిం దని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ శివార్లలో , సరిహద్దు జిల్లాల పరిధిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు.