అమెరికాలో బార్ పై కాల్పులు.. ముగ్గురు మృతి..

అమెరికాలో బార్ పై కాల్పులు.. ముగ్గురు మృతి..
  • 8 మందికి గాయాలు.. అమెరికాలో ఘటన

సౌత్​పోర్ట్(అమెరికా): అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని సౌత్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సిటీలో కేప్ ఫియర్ నది తీర ప్రాంతంలో ఉన్న ఓ బార్​పై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతిచెందగా మరో 8 మంది గాయపడ్డారు. 

ఈ ఘటన శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. బోట్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన వ్యక్తి.. అమెరికన్ ఫిష్ కంపెనీకి చెందిన ఔట్‌‌‌‌‌‌‌‌డోర్ బార్‌‌‌‌‌‌‌‌పై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. సౌత్​పోర్ట్ వాటర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లోని బార్లు, రెస్టారెంట్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వెంటనే యూఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పాట్​కు చేరుకొని పరిశీలించారు. దుండగుడు ఒడ్డుకు దగ్గరగా వచ్చి.. జనంపై కాల్పులు జరిపి.. అనంతరం అదే పడవలో ఇంట్రాకోస్టల్ వాటర్‌‌‌‌‌‌‌‌వే వైపు పారిపోయాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. 

సుమారు అరగంట సెర్చ్​ఆపరేషన్ తర్వాత.. యూఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓ అనుమానితుడి ఓక్ ద్వీపంలోని పబ్లిక్ రాంప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.