టూరిస్టులకు అందుబాటులో.. ‘హిమ దర్శన్’ రైలు

టూరిస్టులకు అందుబాటులో.. ‘హిమ దర్శన్’ రైలు

కల్కా-సిమ్లా మధ్య ప్రారంభం

చండీగఢ్: నేచర్​ లవర్స్​కోసం రైల్వే శాఖ మరో కొత్త సర్వీసును ప్రారంభించింది. హర్యానాలోని కల్కా స్టేషన్​ నుంచి హిమాచల్​ ప్రదేశ్​లోని సిమ్లా వరకు ‘హిమ దర్శన్’ రైలును బుధవారం టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కిటికీలతో పాటు రూఫ్​పైనా గ్లాస్ ​ఫిట్టింగ్​చేసిన ఏడు కోచ్​లతో ఈ ట్రైన్​ను నడిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఈ రూట్​లో ఒక విస్టాడోమ్​ కోచ్​ను నడిపించగా.. విపరీతమైన డిమాండ్​ రావడంతో ఈ ట్రైన్​ను ప్రారంభించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ట్రైన్​ మొత్తం ఎరుపు రంగుతో, సెంట్రలైజ్డ్​ ఏసీతో తీర్చిదిద్దారు.

సర్వీ సు ప్రారంభోత్సవం సందర్భంగా కోచ్​లను రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. కల్కా స్టేషన్​ నుంచి ఉదయం 7 గంటలకు ఈ ట్రైన్​ బయలుదేరింది. బయట కురిసే మంచును చూస్తూ ఈ ట్రైన్​లో ప్రయాణించడం  ద్వారా ఓ సరికొత్త అనుభూతిని పొందొచ్చని రైల్వే అధికారులు చెప్పారు. కొత్తగా ప్రారంభించడం, న్యూఇయర్​దగ్గర్లోనే ఉండడంతో చాలామంది ఈ ట్రైన్​లో ప్రయాణించేందుకు ఇప్పటికే బుకింగ్స్​ చేసుకున్నారని వివరించారు.

విశేషాలు..

ఎరుపు రంగులో ఉన్న ఏడు ఏసీ కోచ్​లు
వందమందికి పైగా ప్రయాణించే వీలు
ఈ రైలు ప్రయాణించే దూరం 95.5 కి.మి.