హిమాచల్​లో.. ఇయ్యాల్నే పోలింగ్

హిమాచల్​లో.. ఇయ్యాల్నే పోలింగ్

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్​లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మొత్తం 55 లక్షల మంది ఓటర్లు 412 మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. సీఎం జైరాం ఠాకూర్, మాజీ సీఎం వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్, బీజేపీ మాజీ చీఫ్ సత్పాల్ సింగ్ లు ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ముందుండి ప్రచారం చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు తన బలాన్ని పెంచుతుందంటూ ఓటర్లను అప్పీల్ చేశారు.

పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పోరాటం

కాంగ్రెస్​ తరఫున ప్రియాంక గాంధీ క్యాంపెయిన్​ చేశారు. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించి.. 300 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్, రూ.680 కోట్ల స్టార్టప్ ఫండ్ అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. డెవలప్​మెంట్ ఎజెండాగా బీజేపీ ప్రచారం వరుసగా రెండోసారి విజయం సాధించాలని బీజేపీ చూస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా డెవలప్​మెంట్ ప్రధాన ఎజెండాగా ప్రచారంచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 7,884 పోలింగ్​ స్టేషన్లు​ పొద్దున 8 గంటలకు ఓటింగ్​ మొదలై 5 గంటల దాకా కొనసాగుతుందని ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించింది. మొత్తం 7,884 పోలింగ్​ స్టేషన్లను​ ఏర్పాటుచేసింది.

కాంగ్రెస్ లోనే కోటీశ్వరులెక్కువ

హిమాచల్ ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులలో సగానికి కంటే ఎక్కువ మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. ఇందులో 90 శాతం మంది కోటీశ్వరులతో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బీజేపీలో 82శాతం, ఆప్ లో 52శాతం, సీపీఎంలో 36 శాతం బీఎస్పీలో 25 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులు. ఇండిపెంటెంట్ క్యాండిడేట్స్ లో 45 మంది కోటీశ్వరులు ఓవరాల్ గా చూసుకుంటే 412 అభ్యర్థుల్లో 226 మంది ఆస్తి కోటికి పైగా ఉంది.