రేపే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

రేపే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(డిసెంబర్ 8) వెలువడనున్నాయి.  మొత్తం 182  స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కి్ంపు ప్రారంభం కానుంది. అన్ని ఎగ్జి్ట్ పోల్స్ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి కనీసం 92 సీట్లు గెలుచుకోవాలి. 1995 నుంచి గుజరాత్ లో బీజేపీనే అధికారంలో ఉంది. 

అటు హిమాచల్ ప్రదేశ్ కి కూడా రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కి్ంపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరిగింది. అక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జి్ట్ పోల్స్ అంచనా వేశాయి.  1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు.