కరోనా బారిన పడిన హిమాచల్ సీఎం

కరోనా బారిన పడిన హిమాచల్ సీఎం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో  ఇటీవల తనతో సన్నిహితంగా  ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు.  వాస్తవానికి  సీఎం  సుఖ్విందర్ సింగ్ సుఖు ఈ రోజు ప్రధాని మోడీతో భేటీ కావాల్సి ఉంది. ఇప్పుడు ఆయన కరోనా బారిన పడటంతో ఆయన కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. 

 సుఖ్విందర్ సింగ్ సుఖు ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ కు ఆయన 15వ ముఖ్యమంత్రి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను 40 స్థానాలను  గెలుచుకుని కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. బీజేపీ 25 స్థానాలకే పరిమితమైతం కాగా ఆప్ ఖాతా తెరవలేదు.