పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఆందోళన

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఆందోళన

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిమ్లాలో హస్తం పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. నరేంద్ర మోడీ సర్కార్ సామాన్యులపై మోయలేని భారం మోపుతుందని ఆరోపించారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని..ఇప్పటికే లీటర్ పెట్రోల్ సెంచరీ మార్క్ ను దాటి 150 రూపాయల దిశగా దూసుకుపోతుందని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా. పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించాలని..లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం

ఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి