ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 65.92 శాతం ఓటింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. షిల్లైలో అత్యధికంగా 77శాతం పోలింగ్ నమోదైంది. సర్కాఘాట్‌లో అత్యల్పంగా 55.40శాతం పోలింగ్ నమోదైంది. 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్న  హిమాచల్ లో మొత్తం 412 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు.  డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. 

1982 నుండి ఇక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. అయితే.. ఈసారి ఆ సంప్రదాయానికి హిమాచల్ ఓటర్లు స్వస్తి పలికి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని అధికార బీజేపీ విశ్వసిస్తోంది. 2017 ఎన్నికల్లో 68 స్థానాలకు గాను 44 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ 21 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ సారి పోటీలో ఆప్ కూడా ఉండటతో అసక్తి నెలకొంది.