హిమాచల్లో భారీవర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

హిమాచల్లో భారీవర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వాతావరణ శాఖ ప్రకారం..రాబోయే రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తు్న్నాయి.. నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆగస్టు 13 తెల్లవారు జామున సిమ్లాలోని దుద్లీ శివారులో రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై నిలిపి ఉంచిన కార్లపై కొండచరియలు విరిగిపడటంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. జేసీబీ, క్రేన్ తో రోడ్లపై పేరుకుపోయిన రాళ్లు, మట్టిని తొలగిస్తున్నారు అధికారులు. 

చక్కీమోర్ వద్ద కొండరిచరియలు విరిగిపడటంతో సిమ్లా ఛండీగఢ్ జాతీయ రహదారిని మూసివేశారు అధికారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు  ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని స్థానిక అధికార యంత్రాంగం సూచించింది. ఛండీగఢ్ నుంచి వచ్చే వాహనదారులు కలా అంబనహన్, కుమార్ హట్టి, సిమ్లా, బద్దినలగర్ కునిహార్ మీదుగా వెళ్లాలని అధికారులు చెప్పారు.