విధ్వంసం సృష్టించిన క్లౌడ్‌బర్స్ట్... 51మందిని రక్షించిన ఎన్టీఆర్ఎఫ్

విధ్వంసం సృష్టించిన క్లౌడ్‌బర్స్ట్... 51మందిని రక్షించిన ఎన్టీఆర్ఎఫ్

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని షెహ్ను గౌని, ఖోలానాల్ గ్రామాల వద్ద క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు రక్షించాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన భారీ వర్షపాతం, కొండచరియలు విరిగిపడటం, మేఘావృతాల కారణంగా హిమాలయ రాష్ట్రం విస్తృతంగా విధ్వంసం కావడంతో పాటు, మరణాలను సైతం నమోదు చేసింది.

ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఆగస్టు 24న భారీ కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. 9వేల 924 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 3వందల దుకాణాలు, 4వేల783 గోశాలలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రభావితమైన జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మండి జిల్లా యంత్రాంగం వాయుసేన హెలికాప్టర్ల సహాయంతో ఆహార పదార్థాలు, మందులను పంపిణీ చేసింది.

అంతకుముందు ఆగస్టు 24న హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్.. మండి జిల్లాలోని కుక్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖును కోరారు. “రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను నా నియోజకవర్గాన్ని సందర్శించాను. ఈరోజు రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. దాదాపు అన్ని ఇళ్లు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు" అని ఆయన తెలిపారు.