Chatrapathi review: ఛత్రపతిగా బెల్లం బాబు ఈమేరకు మెప్పించాడు?

Chatrapathi review: ఛత్రపతిగా బెల్లం బాబు ఈమేరకు మెప్పించాడు?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఛత్రపతి’. 2005లో ప్రభాస్‌ హీరోగా వచ్చిన తెలుగు ఛత్రపతికి ఇది హిందీ రీమేక్. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? బెల్లం బాబు హిందీలో హిట్ కొట్టాడా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.  

కథ: శివ (బెల్లంకొండ శ్రీనివాస్) తన తల్లి, తమ్ముడితో కలిసి పాకిస్తాన్‌లో ఉంటాడు. అక్కడ జరిగిన గొడవల కారణంగా శివ తన కుటుంబానికి దూరమై.. గుజరాత్ తీరప్రాంతానికి చేరుకుంటాడు. శివతో పాటు అక్కడకు వచ్చిన శరణార్థులను గుజరాత్‌లోని లోకల్ రౌడీ భైరవ్ బానిసల్లా చూస్తూ ఉంటాడు. దాంతో.. భైరవ్‌ పై తిరగబడ్డ శివ అతన్ని చంపేసి ఛత్రపతిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవ్ అన్న భవాని ఏం చేశాడు? తన తల్లిని, తమ్ముడిని శివ ఎలా కలుసుకున్నాడు? అనేది మిగతా కథ.

రివ్యూ: కొన్ని క్లాసిక్ సినిమాలు ఉంటాయి. వాటిని టచ్ చేయకూడదు.ఎందుకంటే.. మక్కీకి మక్కీ దించినా, మార్పులు చేర్పులు చేసినా ఆడియన్స్ సింపుల్ గా రిజెక్ట్ చేసేస్తారు. అందుకే రీమేక్ అంటే ఎప్పుడూ కత్తిమీద సామే. సరిగ్గా ఛత్రపతి రీమేక్ లో కూడా అదే జరిగింది. ఒరిజినల్ ఛత్రపతి ఏవైతే హైలెట్ అనుకున్నామో ఆ సీన్స్ మొత్తం లేపేశారు. ఇంట్రోలో షార్క్‌తో ఫైట్ ఆడియన్స్ కి గూస్ బంప్స్  తెప్పించింది. కానీ అది ఇక్కడ మిస్ అయ్యింది. ఇక మదర్ సెంటిమెంట్ కూడా అస్సలు సెట్ కాలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్ గా అనిపిస్తుంది. ప్రీ క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్‌లను కూడా టప టపా కానిచ్చేశారు. తనిష్క్ బగ్చి ఇచ్చిన పాటలు అస్సలు బాలేవు. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోయింది.

నటీనటులు: ఇక నటీనటుల విషయానికి వస్తే... యాక్టింగ్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్ అని చెప్పొచ్చు. డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో బెల్లంబాబు చెలరేగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం మరింత మెరుగవ్వాల్సి ఉంది. నుష్రత్ బరుచ అందంగా కనిపించింది. తల్లి పాత్రలో భాగ్యశ్రీకి పరవాలేదు. ఇక మిగిలిన పాత్రలు కూడా ఒకే ఒకే. ఓవర్ ఆల్ గా చూస్తే.. ఛత్రపతి రీమేక్.. హిందీ వాళ్ళకి ఏమో గానీ.. తెలుగు వాళ్లకి మాత్రం అస్సలు ఎక్కదు.