రుద్రూర్ మండలంలో రామాలయ స్థలం పత్రాలు ఇవ్వాలి..తహసీల్దార్ ను కోరిన హిందూ కమిటీ సభ్యులు

రుద్రూర్ మండలంలో రామాలయ స్థలం పత్రాలు ఇవ్వాలి..తహసీల్దార్ ను కోరిన హిందూ కమిటీ సభ్యులు

వర్ని, వెలుగు: రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాణంపల్లి శివారులో గల రామాలయ స్థలానికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని గ్రామ హిందూ కమిటీ సభ్యులు అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ తారాబాయిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాలయం పొలం సర్వే నంబర్ 217/7 లో ఎకరం 15 గుంటల భూమి ఉందన్నారు. 

1994 నుంచి 2026 వరకు మార్పు చేర్పులకు సంబంధించిన పూర్తి రికార్డు కాపీలు, పహానీలు ఇవ్వాలని తహసీల్దార్​ను కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.