
భారత్ ఇస్రో(ISRO) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3(Chandrayan3) మిషన్‌పై కామెంట్ చేసినందుకు గాను సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj)పై కర్నాటకలో కేసు నమోదైంది. భగల్‌కోట్ జిల్లాలోని బానహట్టి పోలీసు స్టేషన్‌లో హిందూ సంఘాల నేతలు కేసు ఫైల్ చేశారు. ఈమేరకు నటుడు ప్రకాశ్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశాయి.
BREAKING NEWS:-
— Prakash Raj (@prakashraaj) August 20, 2023
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G
అసలు విషయం ఏంటంటే.. చంద్రయాన్-3 మిషన్‌పై నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ కార్టూన్‌ను బొమ్మను పోస్టు చేశారు. ఆ కార్టూన్ లో లుంగి కట్టుకున్న ఓ వ్యక్తి టీ పోస్తున్నట్లుగా ఉంది. ఆ కార్టూన్ కు చంద్రుడి నుంచి వచ్చిన మొదటి ఫోటో ఇదే అనే క్యాప్షన్ ఇచ్చారు ప్రకాష్.
ఆ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ అవడంతో.. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంటి గొప్ప ప్రయోగంపై ఇల్లాంటి కామెంట్స్ చేయడం సరికాదు అంటూ ప్రకాష్ రాజ్ పై విమర్శలతో రెచ్చిపోతున్నారు నెటిజన్స్. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ కారణంగానే హిందూ సంఘాల నేతలు ఆయనపై కేసు ఫైల్ చేశారు.