మార్చేయండ్రా పేర్లు : ఢిల్లీలో బాబర్ రోడ్డు.. అయోధ్య మార్గ్ అయ్యిందా..!

మార్చేయండ్రా పేర్లు : ఢిల్లీలో బాబర్ రోడ్డు.. అయోధ్య మార్గ్ అయ్యిందా..!

న్యూఢిల్లీలోని బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు 'అయోధ్య మార్గ్' స్టిక్కర్‌ వేశారు. బాబర్‌ రోడ్డు పేరు మార్చాలని తమ సంస్థ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా చెప్పారు. బాబర్‌ రోడ్డు పేరును తమ గొప్ప వ్యక్తి పేరుగా మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోంది. హోం మంత్రిత్వ శాఖకు, ఎన్‌డిఎంసికి పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాబర్‌ మసీదు లేనప్పుడు ఢిల్లీలోని బాబర్ రోడ్డు ఎందుకు?" అని గుప్తా ప్రశ్నించారు.

ఈ రోడ్డును చూస్తుంటే నేటికీ మనం బాబర్ కాలంలోనే జీవిస్తున్నామని అనిపిస్తోందని, అందుకే దీన్ని అయోధ్య మార్గ్‌గా మార్చామని విష్ణు గుప్తా తెలిపారు. అంతకుముందు ఈ రోడ్డు పేరు మార్పును కోరుతూ విష్ణు గుప్తా ఎన్‌డిఎంసీ ఛైర్మన్ కు లేఖ రాశారు. బాబర్ హిందువులపై దౌర్జన్యాలు చేశాడని, అందుకో ఆ రోడ్డు పేరును అయోధ్య మార్గ్ గా మార్చాలని కోరారు. అయితే ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆ స్టిక్కర్‌ను తొలగించారు.

అయోధ్య ఆలయంలో శ్రీరామ్ లల్లా 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను పెంచారు. రాష్ట్ర పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైల్వే స్టేషన్‌లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.