రిలయన్స్ క్యాపిటల్ కొనేందుకే హిందూజా గ్రూప్ ఫండింగ్

రిలయన్స్ క్యాపిటల్ కొనేందుకే హిందూజా గ్రూప్ ఫండింగ్

ముంబై:రిలయన్స్​ క్యాపిటల్​ను చేజిక్కించుకోవాలనుకుంటున్న హిందుజా గ్రూప్​ అందుకవసరమైన ఫండ్స్​లో కొంత అప్పుగా సమకూర్చుకోవాలని ప్రయత్ని స్తోంది. హిందుజా గ్రూప్​ 800 మిలియన్​ డాలర్ల ఫండ్​ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు అనిల్​ అంబానీ నడిపిన రిలయన్స్​ క్యాపిటల్​ను దక్కించుకోవడానికి హిందుజా గ్రూప్​ పోటీ పడుతోంది.

రిలయన్స్​ క్యాపిటల్​ను 2021 లోనే రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తన ఆధీనంలోకి తీసుకుంది. కొన్నేళ్లలోనే అయిదు పెద్ద నాన్​–బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు డిఫాల్ట్​ కావడంతో ఆర్​బీఐ ఆ చర్య తీసుకుంది. ఫైనాన్షియల్​ సర్వీసెస్​ మొదలు రియల్​ ఎస్టేట్, కెమికల్స్​ వంటి రంగాలలో హిందుజా గ్రూప్​ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

రిలయన్స్​ క్యాపిటల్​ను కొనడం కోసం గ్రూప్​లోని కంపెనీల నుంచి బిలియన్​ డాలర్ల దాకా నిధులు సమకూర్చుకోవాలని కూడా ప్లాన్​ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి హిందుజా గ్రూప్ స్పందించలేదు.​