శ్రీరామనవమి ఉత్సవాలకు ఆయోధ్య రాముడు ముస్తాబు అవుతున్నాడు. 500 సంవత్సరాల తర్వాత ఆయోధ్య రామమందిరంలో రాముడి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రామనవమి వేడుకల్లో ముఖ్యమైనది సూర్య తిలకం.
ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్నే రాముడికి సూర్య తిలకంగా వ్యవహరిస్తున్నారు. మందిరం మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు గర్భగుడిలోని విగ్రహంపై అదీ ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది.
ఏటా శ్రీరామ నవమికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్య తిలకం మొదలై ఆరు నిమిషాల పాటు బాల రాముడి విగ్రహం నుదుటన ప్రకాశించనుంది. దీనికోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దీనికి అవసరమైన వస్తువులను బెంగళూరుకు చెందిన ఆప్టిక్స్ సంస్థ తయారుచేసిచ్చింది. 75 మిల్లీమీటర్ల కొలత గల వృత్తాకార తిలకంతో అలంకరించబడి ఉంటుంది.