విస్తరణకు ఏటా రూ.100 కోట్లు

విస్తరణకు ఏటా రూ.100 కోట్లు
  •     వెల్లడించిన హిటాచీ ఎనర్జీ

న్యూఢిల్లీ : భారతదేశంలో విస్తరణ కోసం 2019 నుంచి ఏటా రూ.100 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా సీఈఓ నూగూరి వేణు చెప్పారు. గత నాలుగేళ్లలో మూడు ఫ్యాక్టరీలు నిర్మించామని చెప్పారు. సంస్థకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా హైదరాబాద్​లో మంగళవారం నిర్వహించిన వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియాలో తమ ఫ్యాక్టరీల సంఖ్య 19కి చేరిందని వెల్లడించారు.

హైదరాబాద్​లో త్వరలో గ్లోబల్​ కెపాసిటీ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వరంగల్​లోనూ ఒక ల్యాబ్​ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్​లో తమకు సేల్స్​ఆఫీసూ ఉందని చెప్పారు.  హై -వోల్టేజ్ స్విచ్ గేర్, బ్రేకర్లు, హై-వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్  , ట్రాన్స్ఫార్మర్లు, ఎనర్జీ స్టోరేజీ, సబ్ స్టేషన్లు, సెమీకండక్టర్స్, పవర్-సిస్టమ్ ఆటోమేషన్, పవర్-సిస్టమ్ కన్సల్టింగ్ వంటి సేవలను, ప్రొడక్టులను హిటాచీ అందిస్తోంది.