టెర్రరిస్టుల చుట్టాలు.. మ‌న‌ జాతీయ జెండా ఎగురేశారు

టెర్రరిస్టుల చుట్టాలు.. మ‌న‌ జాతీయ జెండా ఎగురేశారు

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు జమ్మూ కాశ్మీర్ లో ఊహించని అరుదైన ఘటన చోటు చేసుకుంది. సోపోర్ లో హిజ్బుల్ ఉగ్రవాది సోదరుడు జాతీయ జెండా ఎగురవేశాడు. ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగ ఉద్యమం లో  భాగంగా హిజ్బుల్ ఉగ్రవాది మట్టూ సోదరుడు రయీస్ మట్టూ తన ఇంటి కిటికీలోంచి త్రివర్ణ పతాకాన్ని ఊపుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫైసల్ అలియాస్ సాకిబ్ అలియాస్ ముసైబ్ గా పిలువబడే జావిద్ మట్టూ.. హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలో క్రియాశీల ఉగ్రవాది. భద్రతా సంస్థల లిస్టులో ఇతను టాప్ 10 లో ఉన్నాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ ప్రజలను కోరిన విషయం తెలిసిందే. 

శ్రీనగర్‌లో తిరంగా ర్యాలీ
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, ఆగస్టు 13 నుండి 15 మధ్య జరిగే 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. మోదీ పిలుపు మేరకు ఆదివారం శ్రీనగర్‌లో మెగా 'తిరంగా' ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో తిరంగా ఎగరడానికి ఎవరూ ఉండరని చెప్పేవారు.జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి యువకుడు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల వలె జాతీయ జెండాను ప్రేమిస్తున్నారని అర్థం చేసుకున్నారని మనోజ్ సిన్హా తెలిపారు. శ్రీనగర్‌తో పాటు బుద్గాం సహా పలు జిల్లాల్లో తిరంగా ర్యాలీలు జరిగాయి.