హెచ్‌‌‌‌జెఎఫ్‌‌‌‌ ఎగ్జిబిషన్​ షురూ

హెచ్‌‌‌‌జెఎఫ్‌‌‌‌ ఎగ్జిబిషన్​ షురూ

హైదరాబాద్​, వెలుగు:  బీ2బీ ఎగ్జిబిషన్స్​ నిర్వహణ సంస్థ ఇన్‌‌‌‌ఫార్మా మార్కెట్స్‌‌‌‌  హైదరాబాద్‌‌‌‌ జ్యువెలరీ, పెర్ల్​, జెమ్‌‌‌‌ ఫెయిర్‌‌‌‌ (హెచ్‌‌‌‌జెఎఫ్‌‌‌‌) 15వ ఎడిషన్​ను నగరంలోని నోవాటెల్​లో ప్రారంభించింది. ఈ సంవత్సరపు ప్రదర్శనలో దాదాపు 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ వినూత్న  డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. దాదాపు 8000 మంది వాణిజ్య కొనుగోలుదారులు  వచ్చారు. 

 600 ఎక్స్‌‌‌‌క్లూజివ్‌‌‌‌ బ్రాండ్లు ఈ ఎక్స్‌‌‌‌పో లో దాదాపు ఒక లక్షకు పైగా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  రాష్ట్ర ఐటీ, వాణిజ్య,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్‌‌‌‌ రంజన్‌‌‌‌,  తెలంగాణ బులియన్‌‌‌‌, జెమ్‌‌‌‌ అండ్‌‌‌‌ జ్యువెలరీ ఫెడరేషన్‌‌‌‌ అధ్యక్షుడు  జగదీశ్​ పెర్షాద్‌‌‌‌ వర్మ, ఐబీజెఏ జాతీయ ఉపాధ్యక్షుడు చేతన్‌‌‌‌ మెహతా పాల్గొన్నారు.