సీఎం సారూ.. మా బడికి బాట వేయండి!

సీఎం సారూ.. మా బడికి బాట వేయండి!

పద్మారావునగర్, వెలుగు: చిలకలగూడ దూద్​బావిలోని గవర్నమెంట్​స్కూల్​కు​దారి కల్పించాలని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డి, సీపీఐ నాయకులు కలిసి సోమవారం ఆందోళనకు దిగారు. స్కూల్​కు అడ్డంగా కొందరు అక్రమంగా గోడ నిర్మించడంతో బడికి వెళ్లేందుకు పేద విద్యార్థులకు దారి లేకుండా పోయిందన్నారు. 

ఈ విషయమై పలుమార్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్​అధికారులను సంప్రదించినా కోర్టు కేసును సాకుగా చూపి ఏడాది కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.