జైతాపూర్ లో 10 లక్షల సొత్తు చోరీ

జైతాపూర్ లో 10 లక్షల సొత్తు చోరీ

ఎడపల్లి, వెలుగు : ఆరు నెలల పాటు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లో ఉంటున్న ఓఇంటిని టార్గెట్ చేసిన  దొంగలు దాదాపు రూ.10 లక్షల విలువైన సొత్తు చోరీ చేసిన ఘటన మండలంలోని జైతాపూర్ గ్రామంలో జరిగింది. ఎడ పల్లి పోలీసుల వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన కంటిపూడి లక్ష్మి ఆరు నెలల క్రితం  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న  తన కుమార్తె శుభశ్రీ ఇంటికి వెళ్లింది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. 

ఇంట్లోని సుమారు రూ. 8.5 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో సహా ఇతర వస్తువులు చోరీ అయినట్లు గుర్తించి ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  5.3తులాల బంగారం, 50తులాల ​వెండి వస్తువులు, రూ. 55,000 నగదు, ఇత్తడి, స్టీల్, రాగి పాత్రలు చోరీ అయ్యాయి.  తన తల్లి లక్ష్మీ అనారోగ్యంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారని కుమార్తె శుభశ్రీ తెలిపారు. బాధితురాలి కుమార్తె శుభశ్రీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎడ పల్లి పోలీసులు తెలిపారు.