ఈ బ్రాండెడ్ టచ్ స్క్రీన్ ఫోన్ భలే ఉందే.. అల్లాటప్పా కంపెనీ కాదు.. రేటు కూడా చాలా తక్కువ..!

ఈ బ్రాండెడ్ టచ్ స్క్రీన్ ఫోన్ భలే ఉందే.. అల్లాటప్పా కంపెనీ కాదు.. రేటు కూడా చాలా తక్కువ..!

ఒకప్పుడు మొబైల్ మార్కెట్ను శాసించిన నోకియా కంపెనీ తాజాగా మరో సరికొత్త ఫోన్తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. నోకియా బ్రాండ్కు చెందిన HMD నుంచి HMD Touch 4G  అనే కొత్త టచ్ స్క్రీన్ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ను ‘హైబ్రిడ్ ఫోన్’ గా ఈ కంపెనీ మార్కెటింగ్ చేసుకుంటోంది. అంటే.. ఇది స్మార్ట్ ఫోన్ కాదు కానీ ఫీచర్ ఫోన్తో పోల్చితే అంతకు మించిన ఫీచర్లు ఈ మొబైల్లో ఉంటాయి. HMD Touch 4G ఫోన్.. పేరులోనే ఈ మొబైల్ 4జీని సపోర్ట్ చేస్తుందని, ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఈ ఫోన్లో ఉందని తేలిపోయింది. 

3.2 అంగుళాల TFT LCD స్క్రీన్, 240×320 పిక్సెల్ రిజల్యూషన్, RTOS Touch ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. Express Chat app అనే మెసెంజింగ్ యాప్ ఈ ఫోన్లో ఉంటుంది. ఇది ప్రీ–ఇన్ స్టాల్డ్ యాప్. మళ్లీ ప్రత్యేకంగా ఇన్ స్టాల్ చేసుకోనక్కర్లేదు. ఈ యాప్ కూడా వాట్సాప్ లాంటిదే. చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ చేసుకోవచ్చు. వీడియో కాల్ సదుపాయం కూడా ఉంది. 

0.3 MP సెల్ఫీ కెమెరా, 2 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. 64MB ర్యామ్, 128 జీబీ వరకూ సపోర్ట్ చేసే ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 32 జీబీ మైక్రో ఎస్డి కార్డ్ వేసుకుని పాటలు, వీడియోలు వినొచ్చు.. వీక్షించ వచ్చు. బ్యాటరీ సామర్థ్యం 1950 mAh బ్యాటరీ. ఈ ఫోన్ ధర 3 వేల 999 రూపాయలు. HMD అధికారిక వెబ్ సైట్ ను క్లిక్ చేసి మొబైల్ ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్ Out Of Stock చూపిస్తుంది. త్వరలో సేల్ లో అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. అరచేతిలో సరిపోయేంత సైజ్లో ఉండటం ఈ మొబైల్ స్పెషాలిటీ. ‘పాకెట్’ ఫ్రెండ్లీ ఫోన్గా చెప్పుకోవచ్చు.