ట్రక్ ​టెర్మినల్స్​..అటకెక్కినయ్​!

ట్రక్ ​టెర్మినల్స్​..అటకెక్కినయ్​!
  •    ఓఆర్ఆర్ చుట్టూ పది నిర్మిస్తామన్న గత సర్కార్​
  •     బాట సింగారం, మంగళ పల్లితోనే సరిపెట్టిన హెచ్ఎండీఏ
  •     మిగతా చోట్ల  రెండేండ్లుగా ప్రతిపాదనలు పెండింగ్
  •     సిటీలోకి వస్తున్న హెవీ వెహికల్స్ తో ట్రాఫిక్ కష్టాలు​ 
  •     కొత్త సర్కార్త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు:  ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 ట్రక్​ లాజిస్టిక్​ టెర్మినల్స్ నిర్మాణానికి  రెండేండ్ల కిందట అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా అత్యుత్తమ రవాణా వ్యవస్థను రూపొందించి దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని కల్పిస్తామని వెల్లడించింది. ఆ వెంటనే హెచ్ఎండీఏ.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ వద్ద బాటసింగారం, నాగార్జునసాగర్​రోడ్​లోని మంగళ్​పల్లి వద్ద రెండు ట్రక్ లాజిస్టిక్ ​పార్కుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మిలిగిన ప్రాంతాల్లోనూ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్టు అధికారులు ప్రకటించారు. ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తు
న్నట్టు పేర్కొన్నారు. అయితే... రెండు ట్రక్ ​టెర్మినల్స్​లోనే కార్యకలాపాలు నడుస్తున్నాయి. మిగతా చోట్ల పెండింగ్ లోనే పడ్డాయి. 

ఆధునాతన సదుపాయాలతో నిర్మించగా..

బాటసింగారం, మంగళ్​పల్లిలో నిర్మించిన ట్రక్​ లాజిస్టిక్ ​పార్కులో ఆధునాతన సదుపాయాలను కల్పించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీకి సరుకులు తీసుకొచ్చే వాహనాలు, ఇతర భారీ వాహనాలు సిటీలోకి ప్రవేశించకుండా ట్రక్​ టెర్మినల్ ​పార్కులోనే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు లాజిస్టిక్​ పార్కులను రూ. 55 కోట్లతో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేశారు. ఇందులో గిడ్డంగులు, 500 ట్రక్​పార్కింగ్​సదుపాయం, 10 వేల మెట్రిక్​టన్నుల ఉత్పత్తులను నిల్వచేసేందుకు కోల్డ్​స్టోరేజ్​సౌకర్యం, డ్రైవర్లకు, రవాణా ఆపరేటర్లకు విశ్రాంతికి డార్మిటరీలు, రెస్టారెంట్స్, ఆఫీసులు, ఇంధనం నింపుకునేందుకు స్టేషన్లు, ప్రైమరీ హెల్త్​సెంటర్లు, ఆటోమొబైల్​ సేవా కేంద్రాలు వంటివి అందుబాటు లోకి తెచ్చారు. ఇప్పటికే వీటి నిర్మాణంతో ఆయా ప్రాంతాల పరిధిలో ట్రాఫిక్​సమస్యలు చాలావరకు  తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు. 

మరికొన్ని చోట్ల నిర్మాణానికి ప్లాన్ 

ముందుగా రెండు పార్కులనైతే హెచ్ఎండీఏ నిర్మించింది. వాటి ప్రారంభ సమయంలోనే అప్పటి మున్సిపల్​  మంత్రి కేటీఆర్​ మరో 8 చోట్ల ట్రక్ ​టెర్మినల్​పార్కులను కూడా నిర్మిస్తామని  అందుకు హెచ్ఎండీఏ సిద్దమవుతుందని పేర్కొన్నారు. రెండేండ్లుగా హెచ్​ఎండీఏ  8 చోట్ల ట్రక్ లాజిస్టిక్​పార్కుల నిర్మాణాన్ని ఇంకా ఆచరణలోకి తీసుకురాలేదు. 

మంగళ్​పల్లిలో 22 ఎకరాల్లో, బాట సింగారంలో 30 ఎకరాల్లో  నిర్మాణాలను పూర్తిచేసింది. దీంతో శంషాబాద్, ఘట్​కేసర్, పటాన్​చెరు, శంకర్ పల్లి, మేడ్చల్​తదితర ప్రాంతాల్లోనూ నిర్మించాలని ప్రతిపాదించినట్టు గతంలోనే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ ఇంకా భూసేకరణ, నిధుల కేటాయింపులు జరగలేదని చెప్పారు.  ఎన్నికల కారణంగా కొంతకాలంగా పనులకు బ్రేక్​పడిందని పేర్కొన్నారు. కొత్త  ప్రభుత్వం ట్రక్​ పార్కులపై మళ్లీ ప్రకటన చేస్తేనే పనులు జరుగుతాయని  అధికారులు చెబుతున్నారు. 

పార్కుల నిర్మాణం జరిగేనా?

దేశవ్యాప్తంగా సరకుల రవాణాకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్​లో లాజిస్టిక్స్ పార్కులు నిర్మాణాలు అవసరమని హెచ్​ఎండీఏ భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఓఆర్​ఆర్​చుట్టూ లేదా హెచ్​ఎండీఏ పరిధిలోని భూముల లభ్యత ఆధారంగా ప్రైవేట్, పబ్లిక్​భాగస్వామ్యంతో పార్కుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిందన్నారు. సిటీ అంతటా మరిన్ని బస్సులు, రైల్వే, మెట్రో టెర్మినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా హెచ్​ఎండీఏ  ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలిపారు.  

రెండేండ్లుగా ప్రతిపాదనలపై ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. దీంతో ఓఆర్ఆర్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వాహనాలు సిటీలోకి వస్తుండగా ట్రాఫిక్ ​సమస్యలు పెరిగిపోతున్నాయి. కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని భూసేకరణ, నిధుల కేటాయింపులు చేస్తే  ప్రతిపాదిత ప్రాంతాల్లో కొత్త ట్రాక్​లాజిస్టిక్​పార్కుల నిర్మాణాలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.