అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం  

అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం  

తప్పుడు భూ రికార్డులు సృష్టించి.. ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన వారిపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నహెచ్ఎండీఏ చర్యలకు ఉపక్రమించింది.

మార్చి 28వ తేదీ తెల్లవారుజామున  3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో ‘ఆపరేషన్ శంషాబాద్’  కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు హెచ్ఎండీఏ ఎస్టేట్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.