హెచ్ఎండీఏ పార్కులకు 25 అవార్డులు

 హెచ్ఎండీఏ పార్కులకు 25 అవార్డులు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించే గార్డెన్​ ఫెస్టివల్​లో హెచ్ఎండీఏ ఏకంగా 25 అవార్డులు గెలుచుకుంది. ఏడో గార్డెన్ ఫెస్టివల్ నేపథ్యంలో  రాష్ట్ర ఉద్యానవన శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. హెచ్ఎండీఏ పార్కులు ఈ అవార్డులకు ఎంపిక కావడంపై అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్​తో పాటు సిబ్బందికి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ అభినందనలు తెలిపారు. సీఎం క్యాంప్​ ఆఫీస్, రాజ్​భవన్, ట్యాంక్​బండ్ ​ల్యాండ్​స్కేప్స్, ఎన్టీఆర్​ గార్డెన్, సంజీవయ్య పార్కు, డాక్టర్ ​జీఎస్కే మెల్కోటే పార్కు(నారాయణగూడ), రాజీవ్​గాంధీ పార్కు (వనస్థలిపురం), ఇందిరాగాంధీ రోటరీ, రాక్​గార్డెన్, బుల్​రోటరీ(నానక్​ రాంగూడ), రోటరీ హెచ్​జీసీఎల్​ఆఫీస్​(నానక్​రాంగూడ), రెయిన్​గార్డెన్( బేగంపేట్), క్రిమిటోరియం(ఫతుల్లాగూడ) ఫస్ట్​ప్రైజ్​లు గెలుచుకున్నాయి.

శాస్త్రీపురం పార్కు, బాపూఘాట్(లంగర్​ హౌస్​), సంజీవయ్య సమాధి, పీవీ సమాధి, ఎన్టీఆర్ మెమోరియల్, రోస్​గార్డెన్, బటర్​ఫ్లై గార్డెన్, వరంగల్​హైవే, ఓఆర్​ఆర్​ మేయిడేన్, రోటరీ–​బొంగులూరు ఇంటర్​ చేంజ్, పటేల్​కుంట పార్క్(కూకట్​పల్లి), లేక్​వ్యూ పార్క్ సెకండ్​ప్రైజ్​కు ఎంపికయ్యాయి. శనివారం సాయంత్రం పబ్లిక్ గార్డెన్ సెంట్రల్ లాన్​లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.