V6 News

సంజీవయ్య పార్కులో అతిపెద్ద స్విమ్మింగ్పూల్

సంజీవయ్య పార్కులో అతిపెద్ద స్విమ్మింగ్పూల్
  •     రూ. 3.67 కోట్లతో నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలోని ట్యాంక్​బండ్​ను ఆనుకుని ఉన్న సంజీవయ్యపార్కులో అతిపెద్ద స్విమ్మింగ్​పూల్​ నిర్మించడానికి 
హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇది నగరానికి మరో ఐకానిక్ ప్లేస్​లా నిలిచిపోయేలా ప్లాన్​చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగేలా  దీన్ని తీర్చిదిద్దనున్నారు. సిటీలోని ముఖ్యమైన పార్కుల్లో లుంబినీ, ఎన్టీఆర్, ఇందిరా పార్కుల తర్వాత సంజీవయ్య పార్కు కూడా ఉంటుంది. ఈ పార్కుకు రోజుకు ఐదు వేలకు పైగా సందర్శకులతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లోవాకింగ్ కు వెయ్యి నుంచి 12 వందల మంది వరకు వాకర్స్​వస్తుంటారు. 

వీరితో పాటు నగరంలో స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా ప్రయోజనకరంగా ఉండేలా నిర్మించబోతున్నారు. రూ. 3.67 కోట్ల ఖర్చుతో త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసేలా  బుద్దపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆసక్తి గల సంస్థలను ఆహ్వానించనున్నారు.